Sunday, February 13, 2011

పాంచజన్య..... ఉద్యమగోస కానరాదా?


మతిలేని మనుషులు, పౌరుశం చచ్చిన జీవులు
నీతిలేని చవటలు, మా పక్కన పిడిబాకులు

భూములు మటు మాయమయ్యినా...
ఆత్మగౌరవం మంటగలిసినా...
ఖనిజ సంపదలన్నీ గట్టు దాటి తరలిపోయినా...
పచ్చనోట్ల కమీషన్లకు కక్కుర్తిపడే నాయకులు!
మా సోయి మీకు లేదా? ఉద్యమగోస కానరాదా?

తిరుగుబాటు చరిత్రను మరిచారా నేడు !
చీకటి గబ్బిలాలను తరిమే ఉద్యమ కాంతిని చూడు !

Saturday, February 12, 2011

పాంచజన్య..... ఉద్యమ జాతర


ఉన్న రక్షణలకు దిక్కు లేదు కాని కొత్త రక్షణలు ఇస్తారట
A.C. రూముల్లో మీటింగ్ లు, పేపర్ ప్రకటనలకు ఫోజులు,

అయ్యయ్యో! ప్రజలకు మొత్తం తెలిసిందే
మాటలు చెబితే వింటారా? ఇక వాగ్దానాలు చేస్తే తంతారా?
గారడి మాటలు నమ్మట్లే, పెత్తందార్లకు ఇక చెమటలే
భూదందాలిక చెల్లవులే, దగాకోర్ల పని పట్టేములే
దోపిడికోటలు కూలే రోజు దగ్గరలోనే ఉన్నదిలే...

గడప గడపన మ్రోగింది కురుక్షేత్ర నగరా !!!
ఊరూరా కదిలింది ఉద్యమ జాతర !!!

Monday, February 7, 2011


పాంచజన్య.....నేను

పోరు జాతర లో రాలే ఇసుకను నేను
పోటెత్తిన జన సముద్రంలోని నీటిబొట్టును నేను
కన్నీటి గానంలో పాటను నేను
కోట్ల గొంతుల నినాదం నేను
పిడికిలి బిగిసిన ఆవేశం నేను
పిచ్చికుక్కను కొట్టే చెప్పును నేను
రగులుతున్న ఉద్యమాగ్నిలో నిప్పురవ్వను నేను
బతుకుబడిలో చదువుతున్న తెలంగాణా విద్యార్థిని నేను 

Sunday, February 6, 2011


పాంచజన్య.....

మన ఇంటిముందరే వాగ్దానాలు
సినిమా డైలాగులతో ప్రసంగాలు
గద్దెనెక్కాలని దీక్షలు
ఊరూరా దొంగ యాత్రలు
మీరు మీరు ఒకటంటా!! ప్రజల చేతికి చిప్పంటా!!

మోసాలన్నీ తెలిసెరా, మా చేతులు అన్నీ కలిసెరా
వేడి నెత్తురు మరిగెను, దొపిడిదొంగల గుండెలు అదిరెను
చీపుర్లు చెప్పులతోనే స్వాగతం
ఇక మానుకోట రాళ్ళతోనే సమాదానం...