Monday, January 31, 2011


పాంచజన్య...బలిదానలు వద్ధురా

తల్లడిల్లకు తమ్ముడా, బాదపడకు నా చెల్లెలా
అన్నకు తోడుగా చెల్లెలుంది, మన బిడ్డకు తల్లి అండుందీ

చచ్చేంత కసిఉన్న కొడుకు ఇంకోడు రాడురా
ఆత్మత్యాగంతో తల్లికి కడుపు కోతేరా
చేయి చేయి కలిపినడిచే అన్నకు గుండెకోతేరా
ఆవేదనతో అగ్గికి ఆహుతి అవ్వద్దురా
కలకలలాడే మన తెలంగాణ పిలుస్తుందిరా
దశబ్దాల ఉద్యమపలితం అనుభవించరా

నవయుగ తెలంగాణ పునాది రాళ్ళు మోసేదెవడురా?
తల్లి రొమ్మును గుద్ధె దొంగల పనిపట్టేదెవడురా? 

పాంచజన్య...పోరుబిడ్డలు

వందేమాతరం పాడిన విద్యార్థులను నైజాము బహిష్కరించాడు
జై తెలంగాణ అంటే నేడు జైల్లో పెట్టారు, బుల్లెట్లతో గాయం చేసారు
ఇంకెక్కడి స్వాతంత్ర్యము, ఇదేనా ప్రజాస్వామ్యము?

రజాకార్లను తరిమి కొట్టాము, నైజాముకు గోరీ కట్టాము
భూములు ప్రజలకు పంచాము, భారతావనిలో తిరిగి కలిసాము
గడులన్ని అదిరిపడెను, దొరలకు పంచెలు తడిసెను

పలుగు పారలు, కారం పొడులు, వడెసెలొ రాళ్ళు, రోకలి బండలు
మా చరిత్ర మరిచారా? ఘనంగా గుర్తుకు తెమ్మంటారా?
10 వేలమంది ప్రాణత్యాగంతొ సాయుదపోరాటం
నేడు 4 కోట్లమంది గుండెమంటతో ఇక ఆగదు పోరాటం...

Wednesday, January 26, 2011

పాంచజన్య...ఆత్మ వంచన వద్దురా

ఊరిలో గొడవొస్తే డిల్లీ అమ్మను అడగాలా?
మన వీది బాగోతాలకి మోసకారి బాబుని పిలవాలా?
నాటకాలు తెలిసికూడా ఆత్మవంచన వద్దురా
నియంతల కాళ్ళ దగ్గర చెప్పులు మోయద్దురా
నా తల్లి తెలంగాణ తల్లడిల్లుతుందిరా
సంకెళ్ళు తెంచుకుని తల్లి ఋణము తీర్చరా

జరిగేది చూస్తున్నాం, ప్రతి మాటా వింటున్నాం
ఇంటిదొంగలందరిని బజారుకీడుస్తాం
రాజకీయ డ్రామాలకు తెరదించి దంచుతాం
వంచించిన ప్రతి కుక్కను తరిమి తరిమి కొడతాం

జై తెలంగాణా.. జై జై తెలంగాణా... 

Tuesday, January 25, 2011

పాంచజన్య... నువ్వే నాయకుడివి

ఉరితాడుని ముద్దాడే భగత్ సింగ్ రావాలా?
ఉద్యమాన్ని నడిపే నేతాజీ కావాలా?

పద్మవ్యూహాన్ని చేదించివచ్చే
ఓ అబిమన్యుని తమ్ముడా..
ఓట్ల లెక్కల ఆటలు బలే గమ్మత్తురా
మదమెక్కిన ఈ మత్తును నువ్వే దించాలిరా..
కుట్రలు పన్నిన కిరాయిమూకలకు కరెక్ట్ జవాబు ఇవ్వరా
పార్టీలన్నీ పక్కకు పెట్టి నాయకుడిలా నువ్వు సాగరా... 
పాంచజన్య...మీకు నివాళి

విద్యార్థుల మరణాలను అపహాస్యం చేస్తారా
బంగారు బవిష్యత్తును చిదిమి చింపెస్తారా
నవ్విపోదురుగాని మీకెమి సిగ్గు
లజ్జ లేని బతుకు డబ్బే కదా ముద్దు

తమ్ముళ్ళ చావుతో నా గుండె పగిలింది
కళ్ళనిండుగా కన్నీరు నిండింది
బరువెక్కిన గుండెతో పంచుకునే బాద నాది
అశ్రువుల రక్తంతో రాసుకున్న పాట ఇది

అమరులైన నా అన్నలు మళ్ళి బ్రతికి వస్తారా?
ఎరుపెక్కిన సుర్యుడిలా పడమర  అస్తమించారా?
ఆఖరికోరిక తీర్చడమే అసలు శ్రద్దాంజలి
స్వరాష్ట్ర సాదనతోనే మీకు నివాళి...

Monday, January 24, 2011

పాంచజన్య...చుక్క నీరు లేదు

డ్యాములన్నీ నిండిపోయినా
పంటలెందుకు ఎండిపోయెరా..?
పక్కన జలదార పారినా
దోసిల్లలోకి తాగు నీరు రాదురా
ఎత్తిపోతల పథకం వచ్చెను
కాలువలన్ని దారి మల్లించెను
దుక్కి దున్న నీరు లేదు
పొలము పంట పండలేదు

మాటలన్నీ మంటగలిసెను
రాతలన్ని బూడిదాయెను
హక్కులన్ని కాలరాస్తిరి
నమ్మి కలిస్తే నట్టెట్లో ముంచిరి
అష్ట లక్ష్మిల తెలంగాణను అప్పులపాలు జేస్తిరి....
పాంచజన్య ..ఊస్మానియ విద్యార్థులం ....

టక్ టక్ టక్ టక్....
మిలిటరీ బూట్లతో కవాతులు
బారెడు మూరెడు తుపాకులు

ధన్ ధన్ ధన్ ధన్...
దూసుకు వచ్చెను బుల్లెట్...
ఇక మన ప్రజాస్వామ్య పయనమెటు....
చిందెను మా రక్తము,
గాయపడెను తల్లి భారతి హృదయము 

ముంబయి మాఫియాలతో సంబందం లేదన్నా
లష్కర్ లాడెన్  టెర్రరిస్ట్ లు మాకు తెలియదన్న

భరతమాత ఒడిలో పెరిగిన ముద్ధు బిడ్డలం
తెగించి కొట్లాడె తెలంగాణా వీర సైనికులం 
మేము ఊస్మానియ విద్యార్థులం ....

ఇది 64 ఏళ్ళ మన స్వాతంత్ర్యమా..?
పోరాటమే ఇక ప్రజాస్వామ్యమా...?

దూసుకువచ్చే మన బెటాలియన్
ప్రాణం తీసినా సరే.... నేను ఇండియన్...
... నేను ఇండియన్   !!
... నేను ఇండియన్   !!

Sunday, January 23, 2011

పాంచజన్య...బుడతడొచ్చాడు

బుడతడొచ్చాడు .. మాయ బుడతడొచ్చాడు
అదికారం అడ్డుపెట్టుకొని కోట్లు తింటాడు
మద్యతరగతి షేర్ మార్కెట్ తో ఆడుకుంటాడు
బట్ట నలగకుండా తిరగుతాడు
అయ్య పేరు చెప్పి బతుకుతాడు

మతవిద్వేశాలు రెచ్చగొట్టయినా
పాతబస్తీలో అల్లర్లు జరిపైనా
రిలయన్స్ పేరుతో డ్రామాలు చేసైనా
అదికారమే తన ఊపిరంటాడు

ధన మద దండయాత్ర మానరా
వాపు నీ బలుపు కాలెదురా
స్టేట్ పరువు పోయినా సీట్ కావాలి
ప్రజలు చచ్చినా సరే పదవి రావాలి
పాంచజన్య...రాజకీయ మెగాస్టార్ 

ప్రజాసేవకై పార్టీ పెట్టి...
సీట్లను అమ్మి కోట్లు కొట్టి...
మెంటల్ క్రిష్ణ లకు టికెట్లు ఇచ్చి...
వైజాగ్ రేపిస్ట్ లకు పదవులిచ్చి...
బెజవాడ రౌడీలకు తన పక్క ప్లేస్ నిచ్చి...
రౌడీ షీటర్ లను వెంటబెట్టుకుని ...
నమ్మి వచ్చిన వాళ్ళకు చుక్కలు చుపించి ....
క్షణ క్షణం నటిస్తూ, నటనలోనే జీవిస్తూ...
ఆ నటనే నిజమని నమ్మిస్తూ...
దశాబ్దాల అబిమానాన్నీ సమాది చేసిన,,,,,,,
రాజకీయ మెగాస్టార్ కి.....
మార్పు తేస్తానంటూ నిమిషానికో మాట మార్చే
చేతకాని దద్ధమ్మ కి చూపించాలి మన మార్పు...

కలియుగ గాందీ...నువ్వు సీట్లమ్మలేదా...?
మదర్ థెరిస్సా పుత్రా...పసిపాప హంతకులు నీ వాళ్ళు కారా...?

నపుంసక నటనా చక్రవర్తికి ఇచ్చె ఆవార్డ్ ఏదీ...?
రక్త పిశాచి కి ఇక పగిలే రికార్డులెన్ని....? 

పాంచజన్య...రెండు కళ్ళ బాబు


తెలుగు వాడి పార్టీ వెలుగు పోయింది...
బడుగు బ్రతుకుల పార్టీ రంగు మార్చింది...
రైతన్నల పార్టీ మీట నొక్కింది...
వెన్నుపోటు నేర్చిన వాడు అన్ని పోట్లూ నేర్చాడు
తనవారినందరిని తన్ని పంపాడు...
గద్దెనెక్కాలని చేసిన రాజకీయం -నేడు అతని అవసరం అయ్యింది
మోసం అతని అలవాటుగా మారింది...
ఇచ్చిన మాటను ఎప్పుడో తప్పాడు,
ఇప్పుడు మాట తప్పడమే తన నైజం అయ్యింది ....

గొంతు కలిపేదొకడు!! తొడలు చరిచేదొకడు!!
మాట ఇచ్చేదొకడు!! మాయ చేసేదొకడు!!
 
రెండు కళ్ళ బాబుకి నాలుకలు ఎన్ని...???
తన్ని తరిమితె రాలే కోట్లు ఎన్ని...???
పాంచజన్య...


నిస్వార్థ రాజకీయాలకు చిరునామా లేదురా
తలరాతను మార్చే మన విదాత ఇంకెవడురా
నమ్మకాన్ని వమ్ము చేసిన మాటలు నమ్మొధ్ధురా
అబిమానాన్ని సమాది చేసిన మత్తునింక వదలరా
లోక్ సత్తా కాదురా, నీ సత్తా చూపరా
అడుగు వేసినాక ఇక వెన్ను చూపొద్ధురా........ 
రాజకీయ చదరంగంలో మరో పావు కదిలింది !!
మోసపోయిన యువత పిడికిలి బిగిసింది........!!