Monday, January 24, 2011

పాంచజన్య ..ఊస్మానియ విద్యార్థులం ....

టక్ టక్ టక్ టక్....
మిలిటరీ బూట్లతో కవాతులు
బారెడు మూరెడు తుపాకులు

ధన్ ధన్ ధన్ ధన్...
దూసుకు వచ్చెను బుల్లెట్...
ఇక మన ప్రజాస్వామ్య పయనమెటు....
చిందెను మా రక్తము,
గాయపడెను తల్లి భారతి హృదయము 

ముంబయి మాఫియాలతో సంబందం లేదన్నా
లష్కర్ లాడెన్  టెర్రరిస్ట్ లు మాకు తెలియదన్న

భరతమాత ఒడిలో పెరిగిన ముద్ధు బిడ్డలం
తెగించి కొట్లాడె తెలంగాణా వీర సైనికులం 
మేము ఊస్మానియ విద్యార్థులం ....

ఇది 64 ఏళ్ళ మన స్వాతంత్ర్యమా..?
పోరాటమే ఇక ప్రజాస్వామ్యమా...?

దూసుకువచ్చే మన బెటాలియన్
ప్రాణం తీసినా సరే.... నేను ఇండియన్...
... నేను ఇండియన్   !!
... నేను ఇండియన్   !!

No comments:

Post a Comment