Monday, January 24, 2011

పాంచజన్య...చుక్క నీరు లేదు

డ్యాములన్నీ నిండిపోయినా
పంటలెందుకు ఎండిపోయెరా..?
పక్కన జలదార పారినా
దోసిల్లలోకి తాగు నీరు రాదురా
ఎత్తిపోతల పథకం వచ్చెను
కాలువలన్ని దారి మల్లించెను
దుక్కి దున్న నీరు లేదు
పొలము పంట పండలేదు

మాటలన్నీ మంటగలిసెను
రాతలన్ని బూడిదాయెను
హక్కులన్ని కాలరాస్తిరి
నమ్మి కలిస్తే నట్టెట్లో ముంచిరి
అష్ట లక్ష్మిల తెలంగాణను అప్పులపాలు జేస్తిరి....

1 comment: