Wednesday, September 14, 2011

బొగ్గు పెల్లలోని నిప్పుకణికలకు వందనం
కాలేజిల్లోని అగ్గిరవ్వలకు వందనం

నాగలి పట్టిన రైతుకు రాగిసంగటి వందనం
పలుగు,పారా, చెమట కు పెరుగుబువ్వ వందనం
ఉద్యోగులందరికి ఉద్యమ వందనం
సఖలజనులందరికి సమ్మెతో వందనం
 ఉద్యమవీరులందరికి పాధాబివందనం


జై తెలంగాణా !! జై జై తెలంగాణా !!

Wednesday, July 20, 2011

 అన్నివేళ్ళు కలిస్తేనే పిడికిలి అవుద్ది
చేయి చేయి కలిపితేనే బలం పెరుగుద్దీ
వెలుగుపంచినపుడే ప్రమిదకు విలువ
ప్రాణమున్నంత  వరకే మనిషికి విలువ
చావుకు తెగించి ఆగం కావద్దు,...
 మద్యల వదిలేసి దూరం పోవద్దు
కలిసి కొట్లాడుదాం- బతికి సాదించుకుందాం

జై తెలంగాణా!! జై జై తెలంగాణా!!

Friday, July 8, 2011

నా తెలంగాణ...
అమ్మ చేతి గోరుముద్ద నా తెలంగాణ
పల్లెపడుచు అమాయకత్వం నా తెలంగాణ
పచ్చడి మెతుకుల పౌరుషం నా తెలంగాణ
ఆడబిడ్డల చేతి రోకలిబండ నా తెలంగాణ
మకుటం లేని రాజదర్బార్ నా తెలంగాణ
మద్యతరగతి పెద్దరికం నా తెలంగాణ
సిరులు పొంగే బాగ్యలక్ష్మి నా తెలంగాణ
కడుపునింపిన అన్నపూర్ణ నా తెలంగాణ
దశాబ్దాల పట్టుదలకు ప్రతీక తెలంగాణ
మతసామరస్యానికి నిదర్శనం తెలంగాణ
దోపిడి గుండెలు వనికించిన విప్లవశంఖం తెలంగాణ
లెగదూడల మంద కదిలింది- అడవిదున్నల గుండె అదిరింది
జై తెలంగాణా!! జై జై తెలంగాణా!!

Monday, July 4, 2011

బానిస బతుకుల్లో చలనం వచ్చింది
చిల్లర నాయకుల్లో మార్పు తెచ్చింది
రాజ్యాంగ సంక్షోబానికి రాజినామాలతోనే నాంది!!

మళ్ళీ వంచనకు మోసపోవద్దురా
కపట నాటకాలకు తలలు వంచొద్దురా
మాట నిలుపుకుంటే మా భుజాలు మీ పల్లకీలురా
మరోసారి వంచిస్తే ... ఇక మీ తన్నులు తినే సరదా తీరుద్దిరా

పాలపొంగుల ఉద్యమాల కాలం పోయిందిరా
స్వరాజ్య కాంక్ష ఇంకా పెరుగుతూనే ఉందిరా
రావణ కాష్టానికి మన పట్టుదలే అగ్గిరా
జై తెలంగాణా!! జై జై తెలంగాణా!!

Tuesday, June 21, 2011

ప్రో,, జయశంకర్ గారి ఆత్మ శాంతికై....

అలుపెరుగని కళియుగ భీష్ముడు
దశాబ్దాల పట్టుదలకు ప్రతీక
ఆవేశానికి ఆలోచనలు కలిపిన ఉద్యమస్పూర్తి
జిత్తులపై ఎత్తులువేసిన పోరాటరథసారధి

నెత్తురు కోరిన రక్కసికి నీ కలమే కరవాళము
నీతిలేని వాదనలకు నీ గొంతే సమాదానము

ఆజన్మ బ్రహ్మచారికి అశ్రు నివాళి
4 కోట్ల వారసులతో అందుకో శ్రద్దాంజళి ...
జై తెలంగాణా !! జై జై తెలంగాణా !!



Thursday, March 17, 2011

పాంచజన్య...
ప్లోరైడ్ నీళ్ళతో బిడ్డలు అవిటివాల్లు అవుతున్నరు
చీరలు నేసె మగ్గాలతో ఉరితాడులు నేస్తున్నరు
పంటకు తెచ్చిన మందుతో పెరుగుబువ్వ తింటున్నరు
పనులు లేక దుబాయిలో వలస కూలీలవుతున్నరు

బతుకులు బూడిద అయితే ఒక్కడూ మాట్లాడడు
కానీ
బొమ్మలు పగిలినయని ఆగమాగం అవుతుండ్రు 
బోడిగుండు మేదవులు నెత్తీనోరు కొట్టుకుండ్రు

కాలిన బతుకుల వేడి ఇంకా తగలనేలేదురా
ఆవేశం అగ్గితొ కలిసిన సునామిని ఇక ఆపేది ఎవడురా

జై తెలంగాణా
జై జై తెలంగాణా

Sunday, February 13, 2011

పాంచజన్య..... ఉద్యమగోస కానరాదా?


మతిలేని మనుషులు, పౌరుశం చచ్చిన జీవులు
నీతిలేని చవటలు, మా పక్కన పిడిబాకులు

భూములు మటు మాయమయ్యినా...
ఆత్మగౌరవం మంటగలిసినా...
ఖనిజ సంపదలన్నీ గట్టు దాటి తరలిపోయినా...
పచ్చనోట్ల కమీషన్లకు కక్కుర్తిపడే నాయకులు!
మా సోయి మీకు లేదా? ఉద్యమగోస కానరాదా?

తిరుగుబాటు చరిత్రను మరిచారా నేడు !
చీకటి గబ్బిలాలను తరిమే ఉద్యమ కాంతిని చూడు !

Saturday, February 12, 2011

పాంచజన్య..... ఉద్యమ జాతర


ఉన్న రక్షణలకు దిక్కు లేదు కాని కొత్త రక్షణలు ఇస్తారట
A.C. రూముల్లో మీటింగ్ లు, పేపర్ ప్రకటనలకు ఫోజులు,

అయ్యయ్యో! ప్రజలకు మొత్తం తెలిసిందే
మాటలు చెబితే వింటారా? ఇక వాగ్దానాలు చేస్తే తంతారా?
గారడి మాటలు నమ్మట్లే, పెత్తందార్లకు ఇక చెమటలే
భూదందాలిక చెల్లవులే, దగాకోర్ల పని పట్టేములే
దోపిడికోటలు కూలే రోజు దగ్గరలోనే ఉన్నదిలే...

గడప గడపన మ్రోగింది కురుక్షేత్ర నగరా !!!
ఊరూరా కదిలింది ఉద్యమ జాతర !!!

Monday, February 7, 2011


పాంచజన్య.....నేను

పోరు జాతర లో రాలే ఇసుకను నేను
పోటెత్తిన జన సముద్రంలోని నీటిబొట్టును నేను
కన్నీటి గానంలో పాటను నేను
కోట్ల గొంతుల నినాదం నేను
పిడికిలి బిగిసిన ఆవేశం నేను
పిచ్చికుక్కను కొట్టే చెప్పును నేను
రగులుతున్న ఉద్యమాగ్నిలో నిప్పురవ్వను నేను
బతుకుబడిలో చదువుతున్న తెలంగాణా విద్యార్థిని నేను 

Sunday, February 6, 2011


పాంచజన్య.....

మన ఇంటిముందరే వాగ్దానాలు
సినిమా డైలాగులతో ప్రసంగాలు
గద్దెనెక్కాలని దీక్షలు
ఊరూరా దొంగ యాత్రలు
మీరు మీరు ఒకటంటా!! ప్రజల చేతికి చిప్పంటా!!

మోసాలన్నీ తెలిసెరా, మా చేతులు అన్నీ కలిసెరా
వేడి నెత్తురు మరిగెను, దొపిడిదొంగల గుండెలు అదిరెను
చీపుర్లు చెప్పులతోనే స్వాగతం
ఇక మానుకోట రాళ్ళతోనే సమాదానం... 

Monday, January 31, 2011


పాంచజన్య...బలిదానలు వద్ధురా

తల్లడిల్లకు తమ్ముడా, బాదపడకు నా చెల్లెలా
అన్నకు తోడుగా చెల్లెలుంది, మన బిడ్డకు తల్లి అండుందీ

చచ్చేంత కసిఉన్న కొడుకు ఇంకోడు రాడురా
ఆత్మత్యాగంతో తల్లికి కడుపు కోతేరా
చేయి చేయి కలిపినడిచే అన్నకు గుండెకోతేరా
ఆవేదనతో అగ్గికి ఆహుతి అవ్వద్దురా
కలకలలాడే మన తెలంగాణ పిలుస్తుందిరా
దశబ్దాల ఉద్యమపలితం అనుభవించరా

నవయుగ తెలంగాణ పునాది రాళ్ళు మోసేదెవడురా?
తల్లి రొమ్మును గుద్ధె దొంగల పనిపట్టేదెవడురా? 

పాంచజన్య...పోరుబిడ్డలు

వందేమాతరం పాడిన విద్యార్థులను నైజాము బహిష్కరించాడు
జై తెలంగాణ అంటే నేడు జైల్లో పెట్టారు, బుల్లెట్లతో గాయం చేసారు
ఇంకెక్కడి స్వాతంత్ర్యము, ఇదేనా ప్రజాస్వామ్యము?

రజాకార్లను తరిమి కొట్టాము, నైజాముకు గోరీ కట్టాము
భూములు ప్రజలకు పంచాము, భారతావనిలో తిరిగి కలిసాము
గడులన్ని అదిరిపడెను, దొరలకు పంచెలు తడిసెను

పలుగు పారలు, కారం పొడులు, వడెసెలొ రాళ్ళు, రోకలి బండలు
మా చరిత్ర మరిచారా? ఘనంగా గుర్తుకు తెమ్మంటారా?
10 వేలమంది ప్రాణత్యాగంతొ సాయుదపోరాటం
నేడు 4 కోట్లమంది గుండెమంటతో ఇక ఆగదు పోరాటం...

Wednesday, January 26, 2011

పాంచజన్య...ఆత్మ వంచన వద్దురా

ఊరిలో గొడవొస్తే డిల్లీ అమ్మను అడగాలా?
మన వీది బాగోతాలకి మోసకారి బాబుని పిలవాలా?
నాటకాలు తెలిసికూడా ఆత్మవంచన వద్దురా
నియంతల కాళ్ళ దగ్గర చెప్పులు మోయద్దురా
నా తల్లి తెలంగాణ తల్లడిల్లుతుందిరా
సంకెళ్ళు తెంచుకుని తల్లి ఋణము తీర్చరా

జరిగేది చూస్తున్నాం, ప్రతి మాటా వింటున్నాం
ఇంటిదొంగలందరిని బజారుకీడుస్తాం
రాజకీయ డ్రామాలకు తెరదించి దంచుతాం
వంచించిన ప్రతి కుక్కను తరిమి తరిమి కొడతాం

జై తెలంగాణా.. జై జై తెలంగాణా... 

Tuesday, January 25, 2011

పాంచజన్య... నువ్వే నాయకుడివి

ఉరితాడుని ముద్దాడే భగత్ సింగ్ రావాలా?
ఉద్యమాన్ని నడిపే నేతాజీ కావాలా?

పద్మవ్యూహాన్ని చేదించివచ్చే
ఓ అబిమన్యుని తమ్ముడా..
ఓట్ల లెక్కల ఆటలు బలే గమ్మత్తురా
మదమెక్కిన ఈ మత్తును నువ్వే దించాలిరా..
కుట్రలు పన్నిన కిరాయిమూకలకు కరెక్ట్ జవాబు ఇవ్వరా
పార్టీలన్నీ పక్కకు పెట్టి నాయకుడిలా నువ్వు సాగరా... 
పాంచజన్య...మీకు నివాళి

విద్యార్థుల మరణాలను అపహాస్యం చేస్తారా
బంగారు బవిష్యత్తును చిదిమి చింపెస్తారా
నవ్విపోదురుగాని మీకెమి సిగ్గు
లజ్జ లేని బతుకు డబ్బే కదా ముద్దు

తమ్ముళ్ళ చావుతో నా గుండె పగిలింది
కళ్ళనిండుగా కన్నీరు నిండింది
బరువెక్కిన గుండెతో పంచుకునే బాద నాది
అశ్రువుల రక్తంతో రాసుకున్న పాట ఇది

అమరులైన నా అన్నలు మళ్ళి బ్రతికి వస్తారా?
ఎరుపెక్కిన సుర్యుడిలా పడమర  అస్తమించారా?
ఆఖరికోరిక తీర్చడమే అసలు శ్రద్దాంజలి
స్వరాష్ట్ర సాదనతోనే మీకు నివాళి...